ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఆషాడమాస బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమ్మవారి బోనాలు ఏర్పాటుచేసి ఆషాడ మాస బోనాల గురించి ప్రిన్సిపాల్ జ్యోతి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన పోతురాజు నృత్యాలు, చిన్నారుల దాండియా ఆకట్టుకుంది. డప్పుల చప్పట్ల మధ్య బోనాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి, విద్యార్థులు దివ్య, కరుణ, రాము, కిరణ్, ఫిరోజ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.
