ఎనిమిదో వార్డు అభ్యర్థి అడుప రాము.
ముద్ర. పరకాల.
తనపై నమ్మకం ఉంచి ఎనిమిదో వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని 8 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి అడుప రాము వార్డు ప్రజలను కోరారు. గురువారం 8వ వార్డులో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి తో కలిసి ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వార్డు అభివృద్ధి కోసం పరకాల మున్సిపాలిటీ నుండి పెద్ద ఎత్తున నిధులు తెచ్చానన్నారు. గడిచిన ప్రభుత్వ కాలంలో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సహాయ సహకారాలతో వార్డులో సిసి రోడ్ల నిర్మాణం మురుగునీటి కాలువల నిర్మాణం చేయడం జరిగిందన్నారు. వార్డు ప్రజల సంక్షేమం దృష్ట్యా తను శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. తనపై నమ్మకంతో రెండవసారి మున్సిపాలిటీ కౌన్సిలర్ గా గెలిపించాలని ఆయన పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. పరకాల మున్సిపాలిటీలో ఈ ఎన్నికలలో అత్యధిక స్థానాలు టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.