Take a fresh look at your lifestyle.

రోడ్డు పనులను పరిశీలించిన విప్

 

కోరుట్ల, ముద్ర;
కథలాపూర్ మండల కేంద్రం లోని చింతకుంట గ్రామం లోని గుంటి పెరుమండ్ల రోడ్లను మంగళవారం రోజు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఇటీవల పనులు మొదలై మట్టిరోడు పూర్తయిన సందర్భంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పని తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. కాంట్రాక్ట్ పనిలో డబ్బులు తక్కువ పడితే మంజూరు చూపిస్తానని తెలిపారు. పని మాత్రం తొందర తొందరగా పూర్తి చేయాలని అన్నారు. విప్ వెంట చెదలు సత్యనారాయణ, కథలాపూర్ సర్పంచ్ శేఖర్, నాయకులు నారాయణరెడ్డి, అజీమ్, నాగరాజు, మల్లేష్, నర్సిరెడ్డి, దేవి యాదవ్, ప్రభాకర్, ఆనంద్, కృష్ణ, వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.