Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ బిల్లులు రూ.111 కోట్లు చెల్లింపులు కలెక్టర్ ప్రతిమా సింగ్

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు జిల్లా వ్యాప్తంగా 5201 ఇందిరమ్మ ఇండ్లకు 111 కోట్ల రూపాయలు చెల్లించినట్లు కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. కౌడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన పనులు ప్రారంభించి, నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.
ప్రతివారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల బిల్లులను చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వెంట స్థానిక తహసిల్దార్, ఎంపీడీవో, హౌసింగ్ అధికారులున్నారు.

Leave A Reply

Your email address will not be published.