Take a fresh look at your lifestyle.

మానవత్వం చాటుకున్న ఎంపీ ఈటెల రాజేందర్

 

ముద్ర : మల్కాజిగిరి

హుజురాబాద్ పర్యటన ముగించుకుని హన్మకొండకు వెళ్తున్న సమయంలో ఈటల రాజేందర్ మానవత్వాన్ని చాటుకున్నారు. మార్గమధ్యంలో ఒక ఆటో రిక్షా బోల్తాపడిన ఘటనను గమనించిన ఆయన వెంటనే తన వాహనాన్ని ఆపించి స్పందించారు.
అప్రమత్తంగా వ్యవహరించిన ఈటల రాజేందర్, గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి, వారిని సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆయన మానవతా దృక్పథాన్ని ప్రశంసించారు.
సమయస్ఫూర్తితో స్పందించిన ఈటల రాజేందర్ చర్యల వల్ల గాయపడిన వారికి వెంటనే వైద్యం అందినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.