Take a fresh look at your lifestyle.

సి ఎం సభాపనుల పరిశీలించిన జిల్లా అధికారులు

 

మహదేవపూర్, ముద్ర:

జిల్లాలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సభా స్థలం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలు మరియు సభా వేదికను క్షుణ్ణంగా పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బారికేడ్లు, వేదిక సాంకేతిక వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్, అవసరమైతే అదనపు స్థలాన్ని చదును చేసి వాహనాల నిలుపుదల సౌకర్యాన్ని విస్తరించాలని సూచించారు.
హెలిప్యాడ్‌ను పరిశీలించిన సందర్భంగా, దుమ్ము రేగకుండా నీరు చల్లడంతో పాటు స్థలాన్ని సమంగా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు .ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్ & బి ఈ.ఈ రమేష్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.