తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ & కల్చరల్ మీట్‌కు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికిన ఆర్గనైజింగ్ నెంబర్ కుచుకుల్ల రాజేష్ రెడ్డి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్
హైదరాబాద్: మార్చి 28, 29 తేదీలలో నిర్వహించనున్న ఫస్ట్ ఎడిషన్ “తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ – 2026” కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారిని నిర్వాహకులు ఆహ్వానించారు.

స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ & ఆర్గనైజింగ్ కో-కన్వీనర్ శివసేన రెడ్డి, ఎమ్మెల్యే & ఆర్గనైజింగ్ కన్వీనర్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యే & ఆర్గనైజింగ్ మెంబర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, స్పోర్ట్స్ వీసీ & ఎండీ సోని బాల దేవి కలిసి ముఖ్యమంత్రిని కలిసి కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కార్యక్రమం లక్ష్యాలు, క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల ప్రాముఖ్యతపై నిర్వాహకులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాప్రతినిధుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం, సాంస్కృతిక ఐక్యతను బలోపేతం చేయడం ఈ మీట్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలిపారు.