Take a fresh look at your lifestyle.

నూతన మహిళ సమైక్య భవనానికి శంకుస్థాపన

తుర్కపల్లి, ముద్ర:
తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో నూతన మహిళా సమైక్య భవన నిర్మాణాన్ని సర్పంచ్ కర్రె మాధవి కరుణాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్టు తెలిపారు .ఈ కార్యక్రమంలోఉపసర్పంచ్ ఉదయ రెడ్డి ,గ్రామ శాఖ అధ్యక్షులు రావుల శ్రీనివాస్, కార్యదర్శి ధార మహేందర్, వర్కింగ్ ఇన్స్పెక్టర్ నవీన్ ,వార్డు సభ్యులు మహేష్, నాగరాజు, అనిల్, గుంటి నాగరాజు ,గ్రామస్తులు ఉపేందర్, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.