రాజకీయంగా నా ఎదుగుదలకు అడ్డుపడిన వ్యక్తి జీవన్ రెడ్డి-ఉద్దేశపూర్వకంగానే ఒక మీడియా ఛానల్ ద్వారా నాపై దుష్ప్రచారం — టిపిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం
ఎమ్మెల్సీగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి 500 కోట్ల రూపాయలు సంపాదించుకున్న జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు
సుద్దాల దేవయ్యను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చింది జీవన్ రెడ్డి కాదా..?
కరీంనగర్:
టిపిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జలకాంతం గారు నేడు నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కాంగ్రెస్ నాయకులు సముద్రాల అజయ్ గడ్డం నాగరాజుతో పాటు పలువురు నాయకులతో కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని 40 సంవత్సరంల నుండి కడుపులో పెట్టుకొని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కి ఆయన
చేసింది శూన్యం
జగిత్యాలలో పార్టీ శ్రేణులకు కోసం నీవు ఏమి చేశావో చెప్పు
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నీవు ఎంత మందిని గెలిపించావు చెప్పు
నీ సొంత పనులు చేసు కున్నావు నీ కుటుంబ సభ్యులకు పని చేసినావు
జగిత్యాల ప్రజలకు నువ్వు చేసింది సున్నా కాంగ్రెస్ పార్టీ ద్వారా
ఎదిగిన నీవు బిసి, ఎస్.సి, మైనారిటీలకు అగ్ర కులాల పేద బిడ్డలకు ఏమి న్యాయం చేసినావు..
మా సీఎం రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నావు
నీకు ఇది న్యాయమా
కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగిన నీవు
కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేయడం తగదన్నారు
కాంగ్రెస్ పార్టీ కోసం నీవు ఏం త్యాగం చేశావో చెప్పాలి
ఎమ్మెల్సీగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి
500 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు.
ఖబడ్దార్ జీవన్ రెడ్డి
ఇంకో సారి సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ఊరుకునేలేదని హెచ్చరించారు.