Take a fresh look at your lifestyle.

అభివృద్ధి, సంక్షేమ పథకాలను అధికారులు అందరు సమన్వయముతో పనిచేసి లబ్ధిదారులకు అందించాలి

  • చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అధికారులు అందరు సమన్వయముతో పనిచేసి లబ్ధిదారులకు అందించాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశము హాలు నందు జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్య, వైద్య గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం,గ్రామీణ అభివృద్ధి, బ్యాంకర్లు, పంచాయతీ రాజ్,న్శిశు సంక్షేమం, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పశు సంవర్ధ క, వెటర్నరీ, మిషన్ భగీరథ, రూరల్ వాటర్ సప్లై, నేషనల్ హై వే, గృహ నిర్మాణ శాఖ, మార్కెటింగ్, అటవీ,ఇరిగేషన్, ఆర్ అండ్ బి, మున్సిపల్ శాఖ ల అధికారులతో వారు చేపట్టిన పనులపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఎం.పి. కొండా విశ్వే శ్వర్ రెడ్డి మాట్లాడుతూ, బ్యాంకర్లు జిల్లాలో కేటాయించిన లక్ష్యం మేరకు అన్ని రంగాలకు విరివిగా రుణాలను అందించాలన్నారు.వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిష్కరించే విధంగా పంట రుణాలు, ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు విరివిగా రుణాలు అందించాలని సూచించారు. గ్రామీణ అభివృద్ధి క్రింద జిల్లాలో 1,86 ,179 లక్షల జాబ్ కార్డ్ లు జారీ చేయడం జరిగిందన్నారు. గత మూడు మాసాలుగా ఉపాధి హామీ పథకం కింద పని దినాలు కల్పించి రోజుకు రూ. 307/- రూపాయల చొప్పున మొత్తం 91.83 కోట్ల రూపాయలను కూలీలకు దినసరి భత్యం అందించడం జరుగుతుందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో వన మహోత్సవం కార్యక్రమం క్రింద నర్సరీలు, ప్లాంటింగ్, ఫిట్టింగ్, మెయింటెనెన్స్ తదితర పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేగాక జిల్లాలో 3815 మందికి వృద్ధాప్య,వితంతు తదితర పెన్షన్లు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో మహిళా శక్తి పథకం కింద పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం నిధులతో వ్యవసాయ శాఖలో ఒక లక్షా అరవై వేల మంది రైతులను గుర్తించి రు .490 కోట్లు పి ఎం కిసాన్ క్రింద అందించడం జరిగిందన్నారు. సరిపోను యూరియా అందుబాటులో ఉందన్నారు.పంట పొలాల మట్టి నమూనాల సేకరించి సాయిల్ హెల్త్ క్రింద హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ఎన్ సి డి కార్యక్రమం కింద మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేయడం జరుగుతుందని, జిల్లాలో 223 పి హెచ్ సి లు, 104 పల్లె దవఖానాలు ద్వారా ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 19 కేజీబీవీ పాఠశాలల్లో 6154 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు.గత సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో 74% ఫలితాలను సాధించినట్లు తెలిపారు.అన్ని పాఠశాలల్లో కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం క్రింద నాణ్యమైన పౌష్టికాహారం అందించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాం లను అందించడం జరిగిందని తెలియజేశారు.శిథిలావస్థలో ఉన్న పాత పాఠశాలలో అవసరమైన మరమ్మతులు పూర్తి అయ్యాయని, అలాగే మరుగుదొడ్లు మరమ్మతులు చేపట్టామన్నారు.మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని 594 గ్రామపంచాయతీలు,హాబిడేషన్ లకు ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరును అందించడం జరుగుతుందన్నారు.అవసరమైన బోరుబావులను మరమ్మతులు చేయించి నీటిని అందించినట్లు ఆయన తెలిపారు. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన కింద పెండింగ్‌లో ఉన్న రహదారి పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు పరస్పర సహకారంతో ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే దిశగా పనిచేయాలని అన్నారు.అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు వారి శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చెవెళ్ల పార్లమెంట్ సభ్యులు సంరక్షిస్తున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 25 శాఖలు చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షించడం జరుగుతుందన్నారు.జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతున్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హార్స్ చౌదరి, డి ఆర్ డి ఎ శ్రీనివాస్,దిశ కమిటీ సభ్యులు అంతారం లలిత, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, వడ్ల నందు, జానకిరామ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.