Take a fresh look at your lifestyle.

కొత్తగా ఏడు నవోదయ విద్యాలయాలు ప్రారంభం

  • గతేడాది డిసెంబర్​ 7న కేంద్ర కేబినెట్​ ఆమోదం.
  • తాజాగా నవోదయ విద్యాలయ అధికారులతో తెలంగాణ విద్యాశాఖాధికారుల భేటీ.
  • వచ్చే నెల 14 నుంచి తరగతులు ప్రారంభం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. గతేడాది డిసెంబర్​ 7న తెలంగాణలో ఈ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. తాజాగా సోమవారం తెలంగాణ విద్యాశాఖ అధికారులు హైదరాబాద్​ లో నవోదయ విద్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజ్ గిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేటలో కొత్తగా మంజూరైన నవోదయ విద్యాలయాల నిర్వహణకు ప్రణాళిక ప్రకారం పూర్తి  చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 14 నుంచి తరగతులు ప్రారంభం అయ్యేలా చర్యలు మొదలుపెట్టారు. కాగా ప్రస్తుతం కరీంనగర్​, కుమురంభీం ఆసిఫాబాద్​, నాగర్​కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, వరంగల్​, రంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు కొనసాగుతున్నాయి. కొత్తగా ప్రారంభం కానున్న ఏడు విద్యాలయాలతో కలిపి వాటి సంఖ్య 16కు చేరింది.

30 ఏళ్ల తర్వాత ఇప్పుడే మంజూరు : 1993 తర్వాత కొత్త నవోదయ పాఠశాలలు తెలంగాణకు మంజూరు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏర్పాటైన పాఠశాలల్లో 1986-87లో రెండు, 1987-88లో ఐదు, 1991-92లో ఒకటి, 1993-94లో మరొకటి ఏర్పాటు అయ్యాయి. ఆ తర్వాత తెలంగాణకు ఒక్కటీ కూడా రాలేదు. తాజాగా 2024-25లో ఏకంకా ఏడు రెసిడెన్షియల్​ పాఠశాలలను మంజూరు చేశారు. ఇప్పటికే ఉన్న తొమ్మిది పాఠశాలల్లో 4,287 మంది చదవుతుండగా వారిలో 2,566 మంది విద్యార్ధులు,1,721 మంది విద్యార్ధినీలు ఉన్నారు. వారిలో గ్రామీణ విద్యార్థులు 3,684, పట్టణ ప్రాంతవాసులు 603 మంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.