Take a fresh look at your lifestyle.

సిబ్బంది సమస్యల పరిష్కారంకే “పోలీస్ దర్బార్” రామగుండం సిపి శ్రీనివాస్.

ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: రామగుండం కమిషనరేట్ స్పెషల్ పార్టీ,క్యూ ఆర్ టి సిబ్బంది, అధికారులకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలిస్ ఎం. శ్రీనివాస్ ఆదేశాల మేరకు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం పోలీస్ “దర్బార్” కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీపీ హాజరై స్పెషల్ పార్టీ,క్యూ ఆర్ టి సిబ్బంది తో మాట్లాడి సమస్యలను,వినతి లను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు.సిబ్బందిఅడిగిన వినతిలను,సమస్యలను వెంటనె పరిష్కరించే విధముగా చూస్తాం అన్నారు.ఏలాంటి సమస్య ఉన్న దర్బార్ లో చెప్పడం ఇబ్బందిగా ఉంటే ఆఫీస్ కి వచ్చి నేరుగా కలిసి చెప్పవచ్చు అన్నారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ స్పెషల్ పార్టీ, క్యూఆర్టి పోలీస్‌ విధి నిర్వహణలో భాగంగా ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోనాల్సి వుంటుంది క్రమ శిక్షణ,ప్రణాళికబద్దంగా విధులు నిర్వహించడంతో ద్వారా ఈ ఒత్తిళ్లను అధిగమించవచ్చని కాని వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాద కరమని కొన్ని సందర్బాల్లో ఈ ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుంది.కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబ రోడ్డున పడుతుందని ముఖ్యంగా క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ గురించి ఆలోచించాలని సూచించారు.సిబ్బంది క్రమశిక్షణ తో డ్యూటీ లను నిర్వర్తించాలని రామగుండం కమిషనరేట్ కి, తెలంగాణ పోలిస్ మంచిపేరు తీసుకురావాలన్నారు.బయట డ్యూటీస్ కి వెళ్ళినప్పుడు ఇబ్బందుల ఉంటె సంబందిత అదికారులకు తెలియచేయాల న్నారు.సిబ్బంది క్రమశిక్షణతో, మంచిప్రవర్తన తో విదులు నిర్వర్తించినప్పుడు అదికారులు తమ వెంట ఉంటామన్నారు. సిబ్బందికి చేయవలసిన విధులు, చేయకూడని పనుల గురించి పలు సూచనలు,ఆదేశాలు చేయడం జరిగింది.చెడు వ్యసనాలకు,చెడు స్నేహాలకు అలవాటు పడి,విధులలో నిర్లక్ష్యం వహించినట్లైతే,పోలీస్ శాఖ ప్రతిష్ట కి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన శాఖ పరమైన చర్య తీసుకొవడంజరుగుతుందన్నారుఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ.రాజు,ఏఆర్ ఏసీపీ ప్రతాప్,ఆర్ఐ లు దామోదర్,శ్రీనివాస్,ఆర్ ఎస్ఐ లు,సిబ్బంది పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.