Take a fresh look at your lifestyle.

జగిత్యాల – ఆదిలాబాద్ ఆర్టీసీ బస్సు ప్రారంభం…

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

జగిత్యాల జిల్లా ప్రయాణికుల కోరిక మేరకు జగిత్యాల నుంచి ఆదిలాబాద్ కు ఆర్టీసీ బస్సు సర్వీసును శుక్రవారం ప్రారంభించినట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఈ సర్వీసు జగిత్యాల నుంచి సారంగాపూర్ జన్నారం మీదుగా అదిలాబాద్ వరకు రెండు ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించడం జరిగినదని, ఇట్టి బస్సుల సమయం ఉదయం 8.20 గంటలకు జగిత్యాల నుండి బయలుదేరి ఆదిలాబాద్ కు 12 :20 గంటలకు చేరుకుని తిరిగి 12: 45 కు అదిలాబాదు నుండి బయలుదేరి సాయంత్రం 4:45 నిమిషములకు జగిత్యాలకు చేరు కొనునని వివరించారు. రెండవ బస్సు జగిత్యాల నుండి మధ్యాహ్నం12:00 గంటలకు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు అదిలాబాద్ చేరుకుని తిరుగు ప్రయాణం నాలుగున్నర గంటలకు బయలుదేరి 8:30 గంటలకు జగిత్యాలకు చేరుకొనునని, ఈ బస్ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.