Take a fresh look at your lifestyle.

ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ లైన్ తొలగింపుకు డిమాండ్

 

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు యం ఎస్ వాసు గారి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ సూరారం 60 గజాల కాలనీలో గత ఇరవై ఏళ్లుగా ఉన్న 33.KV విద్యుత్ లైన్ ఇళ్ల పైనుండి వెళ్లడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడమే కాకుండా, వర్షాకాలంలో షాక్ కు గురయ్యి ప్రాణాలు సైతం కోల్పోవడం జరిగిందని వివరించడం జరిగింది. ఇట్టి సమస్యను పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు గౌ శ్రీ ఈటల రాజేందర్ గారిని కోరడం జరిగింది. వెంటనే స్పందించిన ఎం పి శ్రీ ఈటల రాజేందర్ గారు ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ ఎ డి గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఫండ్స్ ని ఎం పి లాడ్స్ నుండి ఇస్తానని ఎస్టిమేషన్ తయారు చేయాలని సూచించడం జరిగింది. ఇందుకు గాను అందరూ ఎం పి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు శాంపూర్ విజేందర్ రెడ్డి గారు, కంటెస్టెడ్ కార్పొరేటర్ కళ్యాణి శ్రీనివాస్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు సత్తిబాబురాజు గారు, మహిళా నాయకురాలు దేవి గారు, మంగ గారు, వరలక్ష్మి గారు, ఘాస్పెర్ గారు, శ్రీను గారు, రషీద్ గారు, బేగం గారు, తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.