Take a fresh look at your lifestyle.

మొక్కలు నాటిన కాంగ్రెస్ వాదులు

యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటి సభ్యులు సోమవారం కాలనీలో మొక్కలు నాటారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా, ఉదయం స్తానిక తెలంగాణ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు ఆటో స్టాండ్ వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మారెల్లి రాజిరెడ్డి, పట్టణ నాయకులు గుండెటీ రాజేష్, ఐఎన్టియూసి నాయకులు బి.శంకర్ నాయక్ మాట్లాడుతూ.. మనం చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడుతుందని, ప్రతి ఒక్కరు వారి, వారి ఇంటి పెరటిలో రెండు మొక్కలు నాటాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు సాగంటి శంకర్, పోగుల వీరారెడ్డి, యాదగిరి తిరుపతి, దేవనపల్లి చక్రపాణి, మల్లారెడ్డి తిరుపతి రెడ్డి, కొంగర రవీందర్, ఆకుల రాజిరెడ్డి, అనుము రాములు, కిషన్ నాయక్, మార్క రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.