గొల్లపల్లి, ముద్ర: రైతు తన పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామంలో చోటు చేసుకుంది. మండలం ఎస్ ఐ చిర్ర సతీష్ తెలిపిన వివరాల ప్రకారం వెనుగుమట్ల గ్రామానికి చెందిన బండారి లక్ష్మణ్ 46 తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు.ఈ క్రమంలో ఉదయం పొలానికి నీరు పెట్టడానికి బావి వద్దకు వెళ్లి మోటార్ స్విచ్ ఆన్ చేయగా మోటార్ నుంచి నీరు రాకపోవడంతో, మోటర్ పంపులో నీళ్లు పోయడానికి చీరతో కట్టిన బకెట్ ను బావి ఒడ్డున ఉండి బావిలోకి వేయగా భావి దరి కూలి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడాని తన భార్య బండారు గంగవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.