Take a fresh look at your lifestyle.

ఆధునిక పరికరాలతో ఫేస్ రికగ్నైజేషన్ సులువు

– జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి

ఆధునిక పరికరాల ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ సులువుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు.  అర్హులైన వారికి పింఛన్ల పంపిణీ మరింత మెరుగ్గా జరిగేందుకు జిల్లాలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు కొత్త మొబైల్ ఫోన్లు, ఫింగర్ ప్రింట్ డివైస్లు ఇతర సాంకేతిక పరికరాలు కిట్లను కలెక్టరేట్ లో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం  229 సెట్లు మంజూరయ్యాయని, ఈ ఆధునిక పరికరాల ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ సులువుగా జరుగుతుందన్నారు. లేదంటే మంత్ర డివైస్ ద్వారా గాని ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా గాని ఫించను పంపిణీ చేయవచ్చన్నారు. అతి తక్కువ సమయంలో ఈ పరికరాలతో ఎక్కువ మందికి పింఛన్లు పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా  గ్రామీణభివృద్ది అధికారి నాగిరెడ్డి, పెన్షన్ ఏపిఓ శ్రీనివాస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ టీజీ ఆన్లైన్ సిబ్బంది అంజయ్య, రాము  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.