Take a fresh look at your lifestyle.

రంజాన్ ఐక్యత సందేశం… టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఐక్యత, సౌహార్దతకు ప్రతీకగా టీఎన్జీవో ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.
మంగళవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భావాండ్ల వెంకటేష్, జిల్లా కార్యదర్శి షర్ఫుద్దీన్ నేతృత్వంలో ఈ విందు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనదని, ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి సాధించే ఈ సమయంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం సోదరభావానికి ప్రతీక అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి బాలరాజు, కమిటీ సభ్యులు కొట్ర బాలాజీ, చెన్నకేశవులు, పి. కళ్యాణ్ కృష్ణారావు, జె.కె. వెంకటేష్, శ్రావణ్, కరిముల్లా, రహీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ముస్లిం ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.