ముద్ర, కోరుట్ల;
కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో మండల విద్యాధికారి గంగుల నరేశం సర్పంచ్, ఉపసర్పంచ్ లు ఈ రోజు బడిబాట కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని బడి ఈడూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. ప్రభుత్వం విద్యాశాఖ అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, రాగిజావ మరియు పాఠశాల లో గల సౌకర్యాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా ఉన్నత పాఠశాల యూసుఫ్ నగర్ లో పదవ తరగతి నందు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లి రాణి రాజు, ఉప సర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ తుకారాం గౌడ్, పంచాయతీ కార్యదర్శి పృథ్వి, వార్డు మెంబర్ ప్రణీత్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పవన్, ఉపాధ్యాయులు చాంద్ ఖాన్, భాస్కర్, వెంకటరత్నం నాగరాజు లు పాల్గొన్నారు.