ముద్ర,తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో 24 కిలోల గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం నాడు రాజస్థాన్ నుంచి కూకట్‌పల్లికి గంజాయి చాక్లెట్లను తరలిస్తోన్న గోర్ సాహా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గోర్ సాహా ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడని తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి చాక్లెట్ల విలువ రూ. లక్షల వరకు ఉంటుందన్నారు. హాస్టళ్ళు అధికంగా ఉండే కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓ టీ స్టాల్‌లో గోర్ సాహా ముఠా గంజాయి చాకెట్లను విక్రయిస్తున్నట్లుగా గుర్తించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు.