- హాజరుకానున్న 75 మంది విద్యార్థులు
ముద్ర యాదగిరిగుట్ట: ఇంటర్మీడియట్ బోర్డ్ వార్షిక ప్రయోగ పరీక్షలు నేటి నుండి ప్రారంభంకానున్నాయి.యాదగిరిగుట్ట ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నేటి నుండి మూడు రోజుల వరకు ఇంటర్మీడియట్ బోర్డ్ టైం టేబుల్ ప్రకారంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మంజుల, ఇన్చార్జి బలరాం తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 03,04,05,06 తేదీలలో నిర్వహింపబడే ఈ పరీక్షలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల,స్థానిక ఎస్ఎల్ఎన్ఎస్ ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులు కలిపి మొత్తం 75 మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు.ఉదయం 9:00 గంటలనుండి మధ్యాహ్నం12:00 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:00 గంటల నుండి 5:00 గంటల వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించబడతాయని విద్యార్థులు అర్ధగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని,సెల్ ఫోన్లు అనుమతించబోమని అన్నారు.