Take a fresh look at your lifestyle.

కాలనీల్లో ఆహ్లాదకర వాతావరణం కన్పించాలి- శంకుస్థాపన కార్యక్రమంలో అరికపూడి

ముద్ర, శేరిలింగంపల్లి:

అంతర్గత డ్రైనీజి, రోడ్లు, వీధి దీపాలు, మొక్కలతో కాలనీలన్నీ అహ్లాదకర వాతావరణంలో కన్పించాలని పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ అన్నారు. నల్లగండ్ల, నల్లగండ్ల హుడా కాలనీ, నవోదయ కాలనీ, సైబర్ కమ్యూన్ కాలనీల డ్రైనేజి ఔట్ లెట్ సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం రూ. 9 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే అంతర్గత డ్రైనేజి పైప్ లైన్ మరియు కాలనీల ఔట్ లెట్, ఇన్ లెట్ పైప్ లైన్ నిర్మాణం పనులకు చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గ మరియు జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కాలనీ వాసులకు శంకుస్థాపన కార్యక్రమం వల్ల ఉపశమనం లభించిందని, ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని తెలియచేసారు. కాలనీలలో ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణం కలిపించడమే ధ్యేయం అని, అందులో భాగంగా నల్లగండ్ల హుడా కాలనీ వద్ద 10.0 ఎం.ఎల్.డి సామర్థ్యంతో 28 కోట్ల రూపాయల అంచనావ్యయంతో ఎస్.టి.పి నిర్మించడం జరిగినది అని, కాలనీల నుండి వచ్చే నీరు డ్రైనేజి ఇన్ లెట్ ద్వారా ఎస్.టి.పి లో కలుస్తుందన్నారు. ప్రజా అవసరాలకునుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని, తాగు నీటి సరఫరా, మురుగు నీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్స్ విభాగం అధికారులు సీజీఎం పద్మజ, జీఎం వాస సత్యనారాయణ, డీజీఎం భార్గవి, జలమండలి జీఎం కృష్ణ, డీజీఎం నరేందర్, మేనేజర్ అభిషేక్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మియాపూర్ లో….. మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్, ప్రగతి ఎనక్లేవ్, హెచ్.ఎం.టి స్వర్ణపూరి కాలనీ, బి.కె. ఎన్ క్లేవ్, న్యూ కాలనీ, మయూరి నగర్ కాలనీలలో రూ. 2 కోట్ల 17 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హల్ నిర్మాణము పనులకు శంకుస్థాపన, పార్క్ ప్రారంభోత్సవం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ.

Leave A Reply

Your email address will not be published.