Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలి …. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

వైద్య అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో 100 శాతం ప్రసవాలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ఫస్ట్ ,సెకండ్ ఎ న్ సి సబ్ సెంటర్ లోనే అందించాలని డెలివరీ కి సిద్ధంగా ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్ (ఎన్‌సిడి) ఉన్న వారిని ఫిబ్రవరి నెల ఆఖరి వరకు పూర్తిగా గుర్తించి వైద్యం అందించాలని, షుగర్ పేషెంట్లను మానేటరింగ్ చేసి వారికి కావాల్సిన వైద్యం, మందులు అందించాలని అన్నారు. టీబీ పరీక్షలకు సంబంధించి 100 రోజుల ప్రణాళికను తయారు చేసుకోవాలని తెమడ పరీక్ష నిర్వహించిన తరువాత రిపోర్ట్ తొందరగా అందే విధంగా చర్యలు చేపట్టాలని, నిర్మాణం పూర్తయిన పల్లె దావఖానాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రతిరోజు సబ్ సెంటర్, పల్లె దావఖానాలను తనిఖీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.