Take a fresh look at your lifestyle.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి :
తెలంగాణ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బండి రమేష్ శనివారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు.కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న బండి రమేష్‌ను అభినందించిన మంత్రి, ఈ పదవి ద్వారా కమ్మ కులంలోని పేద ప్రజలకు విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సహకారంతో అర్హులైన నిరుపేదలను గుర్తించి, వారిని ఆర్థికంగా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని సూచించారు. కార్పొరేషన్ బలోపేతానికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, అలాగే తనకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి బండి రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కమ్మ కుల బాంధవుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.