ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : కల్వకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం శంకుస్థాపన చేసేందుకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విచ్చేయుచున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.రంగారెడ్డి జిల్లా పరిధిలోని తలకొండపల్లి మండలం ఖానాపూర్ లో ఏర్పాటు చేయనున్న సమీకృత గురుకుల విద్యాలయంతో పాటు కడ్తాల్,ఆమనగల్, మాడుగుల మండలాలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేయనట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఖానాపూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. సభలో ఉపముఖ్యమంత్రి తోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డాక్టర్ మల్లు రవి , AICC ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, రంగారెడ్డి జిల్లా DCC అద్యక్షులు నర్సింహ్మ రెడ్డి తదితరులు హాజరవుతారని నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.