Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా టీకేఆర్ మనవరాలి వివాహం

ముద్ర, హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవరాలి వివాహం ఆదివారంనాడు మేడ్చల్ సమీపంలోని అద్వయ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కృష్ణారెడ్డి కుమార్తె హరిత కూతురు శ్రేయ, నిర్మల్ కు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కుమారుడు అగ్రజ్ ల వివాహానికి పలువురు మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు, అధికారులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. హాజరైన ప్రముఖులలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ వి రమణ, మాజీ ఎంపీ, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మధుయాష్కి, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్, సీనియర్ బిజెపి నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.