Take a fresh look at your lifestyle.

తుంగతుర్తిలో ఘనంగా బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు

 

కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్న పార్టీ శ్రేణులు

ముద్ర…. తుంగతుర్తి…
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కెసిఆర్
అని బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు .మంగళవారం తుంగతుర్తిలో మెయిన్ రోడ్ పై తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ 72 వ జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ కేసీఆరే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం బీఆర్‌ఎస్‌ అధినేత నడుం బిగించిన రోజు ఆయనకు ఏ మద్దతూ లేదన్నారు. మీడియా, మనీ, మజిల్‌ పవర్‌ లేకుండా తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. మళ్లీ ఆయన సీఎం కావాలనే లక్ష్యంతో వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో అందరం కలిసి పనిచేద్దామని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నారం, వెంపటి, రావులపల్లి, కొత్తగూడెం సర్పంచులు కుంచాల శ్రీనివాస్ రెడ్డి, తప్పట్ల ఎల్లయ్య, చింతకుంట్ల మనోజ్, మేడ్డుల రమేష్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుండగాని రాములు గౌడ్, దొంగరి శ్రీను, తునికి సాయిలు గౌడ్,గొపగాని రమేష్ గౌడ్,గౌడ్ చర్ల సత్యనారాయణ, గోపగాని శ్రీనివాస్,మల్యాల రాములు, గుడిపాటి వీరయ్య, మల్లెపాక రాములు, కొండగడుపుల నాగయ్య, విరోజి, ఆంగోతు రవి, గడ్డం సోమేశ్, పుణ్య నాయక్, విజయ్, రచ్చ నవీన్ బిఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.