Take a fresh look at your lifestyle.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న వివాహ వేడుకలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరు

 

అమరావతి, 02.04.26:

హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుమారుడు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వేడుకకు విచ్చేసిన ముఖ్యమంత్రికి మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి స్వాగతం పలికారు.

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి నూతన వధూవరులు జనార్థన్ రెడ్డి–సనాతనిని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

వివాహ వేడుకలో రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అతిథులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు.

Leave A Reply

Your email address will not be published.