మల్యాల, ముద్ర : కరీంనగర్ – జగిత్యాల ప్రధాన రహదారి మల్యాల ఎక్స్ రోడ్ లో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు అదిలాబాద్ జిల్లా జైనథ్ కు చెందిన లారీ మల్యాల ఎక్స్ రోడ్ వద్ద రోడ్డు పక్కన నిలిపారు. బుధవారం తెల్లవారుజామున జగిత్యాల జిల్లా ధరూర్ గ్రామానికి చెందిన గుండేటి రాజేశ్వర్ రెడ్డి కొండగట్టు దేవస్థానంలో నిధులు నిర్వహిస్తున్నారు.

విధులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఘటన చోటుచేసుకుంది. బైక్ పై ప్రయాణిస్తున్న రాజేశ్వర్ రెడ్డి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొని కాలు విరిగి తీవ్రగా గాయపడ్డాడు.. అంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న మల్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
