మల్యాల, ముద్ర :కొండగట్టులో లోయలో పడి యువకుడు ఆత్మహత్యాయత్నం స్వల్ప గాయాలు అయిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.జగిత్యాల జిల్లా మల్యాల కేంద్రానికి చెందిన తునికి మహిపాల్ గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యానికి గురయ్యాడు.

ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆరోగ్య బాగు అవుతుందని నమ్మకంతో కొండగట్టు ఆలయం కి తీసుకురాగా, తండ్రి మందలించాడని తెల్లవారు జామున బేతల స్వామి వెనక లోయలోకి దూకాడు. కొండగట్టు అవుట్ పోస్ట్ ఏఎస్ఐ చిలుక శ్రీనివాస్ సహాయక చర్యలు చేపట్టి 108 లో జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.