సూర్యాపేట ముద్ర ప్రతినిధి :-సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ మంగళవారం దాడులు చేయడం సంచలన సృష్టించింది.పీడీఎస్ రేషన్ బియ్యం కేసులో బాధితుడి సోదరుడు నుంచి లక్ష 30 వేల రూపాయలకు బేరం కుదుర్చుకొని మంగళవారం లక్ష రూపాయలు ఎస్సై సురేష్ కానిస్టేబుల్ నాగరాజు లు లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఇటీవల అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న విషయంలో సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి కి చెందిన మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని తిరుమలగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో లక్ష 30 వేల రూపాయలు పోలీసులకు ఇవ్వడానికి ఒప్పందం జరగగా బాధితుడి సోదరుడు ఏసీబీ ని ఆశ్రయించారు. మంగళవారం లక్ష రూపాయలు ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు లు తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన ఏసీ బీ అధికారులు వెంటనే దాడులు నిర్వహించి ఎస్ఎస్ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు లను అదుపులోకి తీసుకున్నారు.