Take a fresh look at your lifestyle.

నిబద్ధతతో ప్రజల్లో చెరగని ముద్ర 

యాదగిరిగుట్ట, ముద్ర: ముద్ర దినపత్రిక నిబద్ధతతో అనతి కాలంలోనే ప్రజల్లో చెరగని ముద్ర వేసిందని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం అభిప్రాయబడింది. బుధవారం ఉదయం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ముద్ర దినపత్రిక క్యాలెండరు వారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఎల్. వేణుగోపాల నాయుడు, ఆర్. రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ ముద్ర దినపత్రిక సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఎంతో నిబద్ధతతో నడిపిస్తున్నందుకు గర్వకారణంగా ఉందని వారు కొనియాడారు.

ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటూ పెద్ద పత్రికలకు తీసిపోనీ విధంగా అందమైన లేఅవుట్ తో పాఠకులకు అందిస్తూ,వారి మన్ననలను పొందడం గొప్ప విశేషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ముద్ర పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎలిమినేట్ ఇంద్రారెడ్డి, ,ప్రెస్ క్లబ్ ట్రెజరర్ ఏ.రాజేష్, గొట్టిపర్తి భాస్కర్, నోముల నర్సిరెడ్డి, రాజు, కె శ్రీకాంత్ రావు, రమేష్ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, బి గోపరాజు, వి. బాపురాజు, టి శ్రీనివాస్, తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.