ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
ప్రజలకు ఆదర్శం గా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు వ్యాసనాలకు బానిసై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఇకనుంచి అసెంబ్లీ కి వచ్చే ఎమ్మెల్యే లకు డ్రగ్ పరీక్ష లు చేయాల్సిన అవసరం ఉందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు.ఆదివారం జడ్చర్ల లో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే లు
బాధ్యతయుతంగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు. అందుకే అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యే లందరికీ డ్రగ్ టెస్ట్ లు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతానన్నారు. డ్రగ్ టెస్టులకు సంబంధించిన రక్త పరీక్షను అందరికంటే ముందుగా తానే చేయించుకుంటానన్నారు. డ్రగ్స్ టెస్టులలో పాజిటివ్ గా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మొయినాబాద్ లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరగడం, అందులో ఐదు మందికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రజా ప్రతినిధులు డ్రగ్స్ సేవించడం సమాజానికి ప్రమాదకరమని, సిగరెట్ పెట్టలపై వాటిని కాలిస్తే ఊపిరితిత్తులు పాడై పోతాయని, మద్యం బాటిళ్లపై వాటిని సేవించడం ఆరోగ్యానికి హానికరమని రాసి ఉన్న ఎవరు పట్టించుకోవడంలేదన్నారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ సేవించినట్లు పాజిటివ్ గా తేదీన వారిలో ప్రజా ప్రతినిధులు ఉండడంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇతరుల పేరు మీద ఉన్న లైసెన్స్ ఉన్న గన్ను తీసుకొని దాంతో కాల్పులు జరపడం చూస్తే నిందితులకు ఎలాంటి భయం లేదనే విషయం అర్థమవుతున్నదన్నారు. ఈ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ సేవించి పాజిటివ్ గా తేలిన వారిని ఎంత కఠినంగా శిక్షించాలంటే ఆ శిక్షను చూసి ఇతరులు ఎవ్వరికి డ్రగ్స్ తీసుకోవాలంటే ఆలోచన రాకూడదన్నారు.