ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………….
రెడ్ క్రాస్ సంస్థ అందిస్తున్న సేవలు అమోఘమని మహబూబ్ నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సమాజంలో సేవా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి సంస్థ యొక్క ధర్మమన్నారు. మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సంస్థలో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న రవి కుమారుడు ఎం. లోకేష్ ముంబాయి లోని ఏసీక్ మెడికల్ కళాశాల లో వైద్య విద్యకు సీటు సాధించారు. సాధారణ కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు కొనసాగించడంలో సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిన వెంటనే మహబూబ్ నగర్ శాఖ రెడ్ క్రాస్ విద్యార్థి ని ఆడుకునేందుకు ముందుకు వచ్చింది. వైద్య విద్య మధ్యలో ఆగిపోకూడదనే లక్ష్యంతో విద్యార్థికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆయన తండ్రి రవికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సహాయం ప్రశంసనీయమన్నారు. సమాజంలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అవసరమైన వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ లయన్ నటరాజ్, డాక్టర్ సామ్యూల్, సంస్థ సభ్యులు, పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.