Take a fresh look at your lifestyle.

జగిత్యాల కలెక్టరేట్ లో ఏసీబీ సోదాల కలకలం…

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

జగిత్యాల కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఇటీవల జగిత్యాల మున్సిపల్ లో సోదాల నిర్వహించిన ఏసీబీ అధికారులు, తాజాగా కలెక్టరేట్లోని సంక్షేమ శాఖలో ఏసీబీ సోదాలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే జిల్లా సంక్షేమ శాఖలో గతంలో పనిచేసిన ఓ అధికారిపై ఆవినీతి ఆరోపణలు రావడంతో జగిత్యాల డీడబ్ల్యూఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం సుమారు 11 గంటలకు కలెక్టరేట్ లోని డీడబ్ల్యూఓ కార్యాలయానికి చేరుకున్న అధికారులు, అక్కడి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ శాఖపై అనేక ఆరోపణలు వెలువడిన పరిస్థితుల్లో తాజా ఏసీబీ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం రాత్రి వరకు ఈ తనిఖీలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి వెరిఫికేషన్ తర్వాతే మరిన్ని వివరాలు తెలియనున్నాయి. దీనికి తోడు కొన్ని రోజుల క్రితమే సంక్షేమ శాఖ అనుబంధంగా కొనసాగే జిల్లా బాలల పరిరక్షణ అధికారిని హరీష్ ను జిల్లా కలెక్టర్ సర్వీస్ రిమూవల్ చేశారు. ఇప్పుడు అదే సంక్షేమ శాఖలోనే ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం సృష్టిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.