ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని 20వ వార్డు రామాలయం ఎదుట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు జంగిడి రవి యాదవ్ ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మల్ల రాములు , కౌన్సిలర్ రవి యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేష్ , రఘు , అరుణ్, వినోద్, భాను, రమేష్, వనపర్తి జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు దివాకర్ యాదవ్ , రోహిత్, నర్సింహ, నవీన్ తదితరులు పాల్గోని బహుమతులు అందజేశారు.
