కుషాయిగూడ (హెచ్ బీ కాలనీ) , ముద్ర విలేఖరి: హెచ్ బీ కాలనీలో స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు 128 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం హెచ్ బి కాలనీలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లు విచ్చేసి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమంలో అల్లూరి సీతారామరాజు చూపిన తెగువ , పోరాట పట్టిన మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. అలాగే హెచ్ బి కాలనీలో.. అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి జంపాల్ రెడ్డి, ఉల్లేం బాలరాజు, మల్లేష్ గౌడ్, బాల నరసింహ, హరినాథ్ గౌడ్, భూపాల్ గౌడ్, రామకృష్ణ, కరిపే ప్రవీణ్ వంజరి, పూస రమేష్, సలీముద్దీన్, నరేందర్, మధు వర్మ, తదితరులు పాల్గొన్నారు.