Take a fresh look at your lifestyle.

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన

  • హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు
  • రాష్ట్రానికి రూ. 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకు రావడంపై హర్షం
  • తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప జేసినందుకు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల అభినందనలు

(ముద్ర – ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి):- ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని శుక్రవారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బండ్లగూడ జ్ఞానేశ్వర్, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికి పుష్ఫగుచ్చలతో శాలువా లు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా దావోస్ అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి రూ. 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకు రావడంపై ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టడం ద్వారా తెలంగాణ ఖ్యాతిని మరింత ఇనుమడింప జేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఎమ్మెల్యేలు అభినందించారు. 

Leave A Reply

Your email address will not be published.