Take a fresh look at your lifestyle.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ముద్ర, మల్యాల: ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గురువారం మండలంలోని ముత్యంపేట ఐకేపీ, మల్యాల పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షలు రుణ మాఫీ, సన్నపు ధాన్యానికి రూ” 500 లు బోనస్‌, ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేయడానికి నెలల సమయం పట్టేదని అన్నారు.అనంతరం మండలంలోని తాటిపెల్లి, తక్కలపల్లి, మద్దుట్ల, నూకపెల్లి, గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లీశ్వరి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుందని ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మునిందర్, ఎంపీడీవో, స్వాతి, ఏఎంసీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ లు ముత్యాల రామలింగారెడ్డి, బోయిన్పల్లి మధుసూదన్ రావు, డైరెక్టర్లు అరుణ్ రావు, రాజిరెడ్డి, గుర్రం శేఖర్, రాజలింగు, నాయకులు దారం ఆదిరెడ్డి, వెల్మ లక్ష్మారెడ్డి, ముత్యం శంకర్, శనిగారపు తిరుపతి, కటకం వినయ్, నేరెళ్ల సతీష్ రెడ్డి, లక్ష్మణ చారి, కోరేపు వెంకటేష్, పోతాని రవి, నక్క అనిల్, హరినాథ్, మర్రి లక్ష్మణ్, ముద్దం శ్రీనివాస్, చెవుల మద్ది శ్రీనివాస్, ముత్యాల నరసింహ రెడ్డి, బండి రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.