ముద్ర ప్రతినిధి, నిర్మల్: కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ వైమానిక దాడులు చేయడాన్ని హర్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరిపారు.అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.పహల్గాం దాడికి భారత్ సైన్యం ప్రతీకారం తీర్చుకోవడం హర్షణీయమని అన్నారు.భారత సైన్యానికి, నరేంద్ర మోడీకి అందరం అండగా ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, రాష్ట్ర నాయకులు రావుల రామనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మె రాజు, జిల్లా ఉపాధ్యక్షులు అలివేలు మంగ, కమల్ నయన్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసేల అర్జున్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రజనీ వైద్య, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, మాజీ పట్టణ అధ్యక్షులు సాదం అరవింద్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు దశరథ్ పోశెట్టి, సుధాకర్, అయ్యన్న గారి రాజేందర్ తదితరులు ఉన్నారు.