Take a fresh look at your lifestyle.

ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి

  • ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయులతో పాటు పూర్వ విద్యార్థులు చొరవ చూపి విద్యార్థుల సంఖ్య పెంచాలనీ జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కోరారు. జగిత్యాల పట్టణ 15వ వార్డు ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ. 2.50 కోట్లతో 15 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే ఎన్ సిసి గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ కే ఎన్ ఆర్ కళాశాల ప్రారంభం అయి నేటితో 60 ఏండ్లు పూర్తి కావడం ఆనందదాయకమని, విద్య శాఖ అనుమతుల కోసం కృషి చేసి,విద్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి సంతకంతో నేడు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల కోసం మంజూరైన నిధుల కోసం నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులదని, అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు నీటిని వృథా చేయవద్దు,కలుషితం కాకుండా చూడాలన్నారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం తో 5వేల కుటుంబాలకు నీటి సదుపాయం కల్పించిన సంతృప్తి కలిగిందన్నారు. డిగ్రీ కళాశాల కు స్థలం ఇచ్చిన భూదాతలు కాసుగంటి నారాయణ రావు విగ్రహ ఏర్పాటుకు స్థానిక నాయకులు,పూర్వ విద్యార్థుల కోరిక మేరకు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ అశోక్, మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్, అడువల లక్ష్మణ్, ఎఓ శ్రీనివాస్, డిఇ వరుణ్, బద్దం జగన్, అనిల్,ప్రభాకర్ రావు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.