Take a fresh look at your lifestyle.

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో యువకుడు…

  • రెండు నెలల వ్యవధిలో రెండవసారి హైక్…

మల్యాల, ముద్ర : మండలంలోని గత కొన్ని రోజులుగా పలువురి మొబైల్స్ వాట్సాప్ హైక్ అవుతున్నాయి . సైబర్ కేటుగాళ్లు రోజురోజూకు కొత్తకొత్త మోసాలకు పాల్పడుతున్నారు. మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన యాళ్ల మధు అనే యువకునికి వాట్సప్ మంగళవారం రెండవసారి హైక్ కావడంతో పలు వాట్సప్ గ్రూపుల పేరు మార్చి ఎస్బిఐ బ్యాంక్ పేరిట కేవైసీ చేసుకోవాలని మెసేజ్లు వచ్చాయి.

మధును వివరణ కోరగా తన వాట్సప్ హైక్ అయినట్లు తెలిపాడు. వెంటనే తన నెంబర్ నుంచి ఎలాంటి మెసేజ్లు లింకులు వచ్చిన ఓపెన్ చేయవద్దని పలువురికి ఫోన్ చేసి సమాచారం అందించినట్లు పేర్కొన్నాడు. రెండు నెలల వ్యవధిలో రెండవసారి హైక్ అయినట్లు మధు తెలిపాడు. తన వాట్సప్ హైక్ కావడంతో 1930 సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేసినట్లు పేర్కొన్నాడు.

Leave A Reply

Your email address will not be published.