Take a fresh look at your lifestyle.

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలకు సూచించారు. సోమవారం అరైవ్ – అలైవ్ కార్యక్రమం నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ…రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. హెల్మెట్, సీట్‌ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు.
ఎస్పీ డి. వి శ్రీనివాసరావు మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా 1.70 లక్షల మంది రోడ్డు ప్రమాదాల ద్వారా మృతి చెందితే, తెలంగాణలో 70 వేల మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో హత్యలు, అత్యాచారాలు సంవత్సరంలో 30 జరిగితే, రోడ్డు ప్రమాదాల ద్వారా 350 మరణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం మద్యం సేవించి వాహనాలు నడపడం సీటు బెల్టు పెట్టుకోకపోవడం తదితర కారణాలవల్ల చాలామంది మృత్యువాత పడుతూ కుటుంబాలకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ నందగోకుల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని హెల్మెట్ ధరిస్తూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు.
అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు… హెల్మెట్ వాడకంపై ఓ కానిస్టేబుల్ మిమిక్రీ అందర్నీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ తహసిల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి దేవకుమార్, సర్పంచ్ పాతూరు భాను, ఎంపీడీవో రాజిరెడ్డి, డీఎస్పీ నరేందర్ గౌడ్,
సీఐ వెంకటరా రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నో హెల్మెట్…నో ఎంట్రీ @ నందగోకుల్  కలెక్టర్ ప్రతిమా సింగ్ సమక్షంలో తీర్మానం

ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా మెదక్ జిల్లాలో ఉన్న 492 గ్రామపంచాయతీలలో గ్రామ సభల ద్వారా అరైవ్- అలైవ్ కార్యక్రమన్ని నిర్వహించారు.


నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ ప్రతిమా సింగ్,, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు హాజరయ్యారు. పాలవర్గం నో ఎంట్రీ…నో హెల్మెట్ @ నందగోకుల్ ఏకగ్రీవ తీర్మాణించి వినూత్న కార్యక్రమనికి శ్రీకారం చుట్టారు.


హెల్మెంట్ లు పెట్టుకుని ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామ ప్రజల ప్రాణ రక్షణ ద్యేయంగా నందగోకుల్ గ్రామస్తులు చేసిన ఆలోచన బాగుందని జిల్లా ప్రజలు అందరు నందగోకుల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామ పంచాయతీలలో నో హెల్మెంట్…నో ఎంట్రీ అనే కార్యక్రమన్ని చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.