Take a fresh look at your lifestyle.

పోటా పోటీగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు

 

నేడు బి ఫామ్ తో భారీ ఎత్తున నామినేషన్లు వేసే అవకాశం

రెండో రోజు 35 మంది అభ్యర్థులు 36 నామినేషన్లు

జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఎన్నికల సందడి

ముద్ర, నారాయణ పేట:

నారాయణపేట జిల్లా కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియతో ఎన్నికల హీట్ మొదలైంది. గురువారం 35 మంది అభ్యర్థులు 36 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బిజెపి నుంచి 10మంది అభ్యర్థులు, కాంగ్రెస్ 11, ఏఐఎంఐఎం 01, టిఆర్ఎస్ 12, టిడిపి 01, స్వతంత్రులు 02 నామినేషన్లు వేశారు. కాగ నేడు నామినేషన్లకు చివరి రోజు కావడంతో బి ఫాంతో పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు వేసే అవకాశం ఉంది. గురువారం టిఆర్ఎస్ బిజెపి అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల వ్యయ పరిశీలకులు విజయ్ కుమార్, డి.ఎస్.పి లింగయ్య లు పరిశీలించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇలా ఉండగా జనవరి 28న రెండు నామినేషన్లు దాఖలు కాగ పేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఇప్పటివరకు 38 నామినేషన్లు దాఖలు అయ్యాయి.


మద్దూర్, కోస్గి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

జిల్లాలోని మున్సిపాలిటీలలో నామినేషన్ల ప్రక్రియ ను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లాలోని మద్దూరు, కోస్గి మున్సిపాల్టీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. హెల్ప్ డెస్క్ ద్వారా అభ్యర్థులకు ఉన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. కేంద్రాల్లో నామినేషన్ల పత్రాలను తెలుగు తో పాటు ఇంగ్లీష్ బాషలో ఉన్నవి కూడా అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని వార్డుల ఓటరు జాబితాలను ఉంచుకోవాలన్నారు. వచ్చిన నామినేషన్లను ఎప్పటికప్పుడు స్కాన్ చేసి టీ పోల్ అప్ లోడ్ చేయించాలని కమిషనర్ల ను ఆదేశించారు. కోస్గి మున్సిపాలిటీ పై అంతస్తు భవనంలో భద్ర పరిచిన బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల పత్రాలను కలెక్టర్ పరిశీలించారు. కోస్గి లో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.