పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యే రేవూరి.
ఆరు స్థానాలకు పరిమితమైన టిఆర్ఎస్.
ముద్ర. పరకాల.
పరకాల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను దక్కించుకొని అతిపెద్ద పార్టీగా నిలిచింది. పరకాల మున్సిపాలిటీలోని 22 వార్డులలో 13 వార్డులను తెలుసుకొని చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకుంది.శుక్రవారం పరకాల పట్టణంలోని గణపతి డిగ్రీ కాలేజ్ ఆవరణలో పరకాల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మొదటి రౌండులో బిజెపి పార్టీ మూడు స్థానాలను గెలుచుకొని కాంగ్రెస్ బిజెపి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చింది. మొదటి రౌండులో కాంగ్రెస్ రెండు స్థానాలు టిఆర్ఎస్ రెండు స్థానాలు దక్కించుకున్నాయి. రెండు మూడు నాలుగు రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ దూసుకు పోయింది. ప్రతి రౌండ్ కు 7 వార్డులను లెక్కించగా రెండు మూడు రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఏ దశలోను బిజెపి బీఆర్ఎస్ పార్టీలు పోటీ ఇవ్వలేకపోయాయి. గత పాలకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక స్థానం ఉండగా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు గెలుచుకొని పట్టణ నిలుపుకుంది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 17 స్థానాలను గెలుపొందగా ఈసారి ఎన్నికల్లో ఆరు స్థానాలకు పరిమితమై చతికిలబడింది.
పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యే రేవూరి.
పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడంతో పరకాలపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పట్టును నిలుపుకున్నారు. పరకాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా ఆయన ముందుకు సాగారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందునుండే అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నుండి పరకాల పట్టణంలో అనేక దఫాలుగా పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపి బలమైన నాయకులను బరిలో నిలిపారు. అభ్యర్థుల ఎంపిక మొదలు అన్నీ తానై ఒంటిచేత్తో ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊహించిన దాని కంటే ఎక్కువ స్థానాలు తగ్గించుకోవడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాయి.
ఆరు స్థానాలకు పరిమితమైన బీఆర్ఎస్.
పరకాల మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ వారు స్థానాలకు పరిమితమైంది. గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ 17 స్థానాలను తెలుసుకొని చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికలలోను అత్యధిక స్థానాలను దక్కించుకొని పరకాలపై గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పిన మాటలను పరకాల ప్రజలు విశ్వసించలేదు. దీంతో టిఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాలకు పరిమితమై పరకాలలో చతికిల పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరకాల మున్సిపాలిటీ జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి దక్కిన స్థానాల పట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకు ఉంది. మొదటినుండి పరకాలలో అత్యధిక స్థానాలు దక్కించుకొని పెద్ద పార్టీగా అవతరిస్తామని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఇంటిని ప్రచారం నిర్వహించినప్పటికీ ఆయన మాటలను ప్రజలు పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపించలేదు.