Take a fresh look at your lifestyle.

పదవి విరమణ పొందిన ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా
బోథ్ మండలం కౌట- బి గ్రామానికి చెందిన ఓరుగంటి సురేష్ గత 17 సంవత్సరాలు దేశ సేవ చేసి పదవి విరమణ పొంది స్వగ్రామానికి చేరుకున్నారు. ఈయన తన విధి నిర్వహణలో భాగంగా జమ్మూ
కాశ్మీర్, బెంగుళూరు, సిక్కిం లతో పాటు ఐక్యరాజ్యసమితి తరుపున కాంగో దేశంలో సైతం విధులు నిర్వర్తించారు. కాగా పదవి విరమణ పొంది స్వగ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్థులు, స్నేహితులు, సైన్యంలో పనిచేసి పదవి విరమణ పొందిన వారు, ప్రస్తుతం సైన్యంలో, పోలీస్ శాఖ లో కొనసాగుతున్న గ్రామ యువత పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ దేశానికి సేవే చేసే అవకాశం నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పుట్టిన ఊరుకు, గ్రామస్తులకు తాను ఎల్లప్పుడూ ఋణపడి ఉంటానని అన్నారు. గ్రామంలో యువత అధిక సంఖ్యలో దేశ సేవ కు సన్నాద్దం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓరుగంటి స్వామి, ఉప సర్పంచ్ ఇట్టేడి రమణ రెడ్డి, విడిసి అధ్యక్షుడు పిడుగు అశోక్ రెడ్డి, విడిసి మాజీ అధ్యక్షుడు బి. శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యాయులు వినాయక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.