Take a fresh look at your lifestyle.

గండిపేట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

 

 

ముద్ర, బండ్లగూడ: గండిపేట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆదివారం ఉదయం ఖానాపూర్ నుండి శంకరపల్లి వైపు మార్గంలో ఓ టీ సెంటర్ ఎదురుగా ఉన్న ఫామ్ హౌస్ వెనుక వైపు గల గండిపేట చెరువు లో ఒక మగ వ్యక్తి(55) మృతదేహం లభ్యమైంది. అతను ప్రమాదవశాత్తు జారీపడి ఉండవచ్చు లేదా ఇంకేదైనా ప్రదేశంలో పడి కొట్టుకు వచ్చి ఉండవచ్చు లేదా ఇంకేదైనా కారణం ఉన్నదా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం కొరకు ఉస్మానియా హాస్పిటల్ మార్చురీ లో భద్రపరిచారు. సదరు వ్యక్తి తెలుపు రంగు చొక్కా , నీలం రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు.

ఎవరైనా ఇట్టి వ్యక్తి ని గుర్తిస్తే నార్సింగి పోలీస్ స్టేషన్లో లేదా 8712568341,8712663119 నెంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.