ముద్ర, శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నానక్ రామ్ గుడా లో రూ 48.00 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు కాలనీ వాసులు మరియు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ రోడ్ నిర్మాణ పనుల్లో నాణ్యతా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని అదేవిధంగా రాబోవు కాలంలో కాలనీ వాసులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ వీలైనంత త్వరగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు వారు సూచించారు. గచ్చిబౌలి డివిజన్ లో ప్రణాళిక బద్దంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని పనులు చేపట్టి కాలనీలలో మౌనిక వసతులు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.గచ్చిబౌలి డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలియజేశారు.అదేవిధంగా కాలనీ అభివృద్ధికి ఎల్లవేళలా వారి సహాయ సహకారాలు ఉంటాయని కాలనీ వాసులకు తెలపటం జరిగింది.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ నిఖిల్,,గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు శివ సింగ్, సీనియర్ నాయకులు మల్లేష్ , శ్రీకాంత్ రెడ్డి, ఉమేష్, శేఖర్,సింగ్,సుమన్,తుకారాం, మహేందర్, శ్రీకాంత్,నగేష్, అరవింద్, సహదేవ్,నానక్ రామ్ గుడా వాసులు,స్థానిక నేతలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.