భూమ్యాకాశాలు తల్లకిందులైనా సరే.. రుణమాఫీ అమలు చేసి తీరతాం

  • రైతులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ

ముద్ర, తెలంగాణ బ్యూరో: అటు సూర్యుడు ఇటు ఉదయించినా... భూమి, ఆకాశం తల్లకిందులైనా సరే తెలంగాణ రైతులకు రుణమాఫీ చేసి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో ఉరేసుకుని చచ్చినా కూడా రైతులకు ఇచ్చిన హామీని తప్పమని, ఆగస్టు 15 లోపల రైతులకు రూ. 2 లక్షల రుణామాఫీ చేసి తీరతామని ముఖ్యమంత్రి అన్నారు. నారాయణ పేట‌్ జిల్లా మద్దూరులో ఆయన  కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పలు పార్టీలు మిమ్మల్ని మచ్చిక చేసుకోవాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఎవరు ఏమి చెప్పినా నమ్మవద్దని, రైతులెవరూ అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది అని అన్నారు.