అనతి కాలంలోనే ప్రజల అభిమానాన్ని చూరగొన్న ముద్ర
- రామగిరి, కమాన్ పూర్ ఎస్ఐలు రవి ప్రసాద్, రాములు
ముద్ర, రామగిరి: అనతి కాలంలోనే ముద్ర దినపత్రిక ప్రజల అభిమానాన్ని చూరగొన్నదని రామగిరి, కమాన్ పూర్ ఎస్సైలు కటిక రవి ప్రకాష్ బేతి రాములు అన్నారు.
మంగళవారం ముద్ర దినపత్రిక క్యాలెండర్ నీ వారు పోలీస్ స్టేషన్ లలో అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్ఐ లు మాట్లాడుతూ ఎవరికి భయపడకుండా నిర్భయంగా వార్తలు రాసి నిజా నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం పాత్రికేయుల పై ఉందన్నారు. ముద్ర దినపత్రిక పక్షపాత ధోరణి లేకుండా సమన్వయం పాటిస్తూ ప్రజలకు అత్యంత వేగంగా వార్తలు అందించడంలో పతాక శీర్షికన నిలబడుతుందని ఎస్ఐ లు తెలిపారు.